పవన్ నిరాడంబరతకు ఫిదా అయిపోయాడట....


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరాడంబరత పై ఆయనతో సహ ప్రయాణికుడిగా ఈమధ్య విమానంలో ప్రయాణించిన జయదేవ్ అప్పన్నగిరి తన ఫేస్ బుక్ లో పెట్టిన మెసేజ్ అందర్నీ ఆకర్షిస్తోంది.

హైదరాబాద్ లో బిజినెస్ చేసే జయదేవ్ అప్పన్నగిరి ఈమధ్యన భాగ్యనగరం నుండి లాస్ ఏంజెల్స్ వెళ్ళడానికి దుబాయ్ మీదుగా వెళ్ళే విమానంలో బిజినెస్ క్లాస్ లో టికెట్ బుక్ చేయించుకున్నాడు. అయితే భాగ్యనగరంలో ఉండే ట్రాఫిక్ సమస్యలు వల్ల జయదేవ్ ఆ విమానం టెక్ ఆఫ్ అయిపోయే చివరి నిముషంలో విమానంలోకి ఎంటర్ అయ్యాడట. జయదేవ్ తన కూడ విమానంలోకి తెచ్చుకున్న రెండు ముఖ్యమైన లగేజ్ బ్యాగ్ లను ఆ విమానంలోని బిజినెస్ క్లాస్ లోని కోట్ బిన్ లో పెడదామని ప్రయత్నించినా అప్పటికే ఆ విమానంలోని బిజినెస్ క్లాస్ బిన్స్ అన్నీ నిండి పోయి ఉండడంతో ఆ బ్యాగ్స్ ఎక్కడ పెట్టాలో తెలియక తికమక పడుతూ ఎయిర్ హోస్టెస్ సహకారం తీసుకుంటూ ఇబ్బంది పడుతున్న పరిస్థుతులలో అదే బిజినెస్ క్లాస్ లో తన ముందు వరుసలో కూర్చుని ఉన్న వ్యక్తి తన లగేజ్ బిన్ ఉపయోగించుకోమని చెపితే తన సమస్య తీరి ఆ వ్యక్తికి థాంక్స్ చెపుదాము అని ముందుకు వెళితే ఆ వ్యక్తి మరెవ్వరో కాదు పవన్ కళ్యాణ్ అవ్వడం జయదేవ్ ను ఆశ్చర్యంలో ముంచెత్తి వేసిందట.

Jayadev Galla is a Brother-in-law of Prince Mahesh Babu.
జయదేవ్ చెప్పిన థాంక్స్ కి పవన్ ప్రతిస్పందిస్తూ సాటి మనిషికి ఆ మాత్రం సహాయం చేయకపోతే సమాజంలో జీవించడం అనవసరం అన్న పవన్ మాటలకు నోట మాట రాని జయదేవ్ పవన్ నిరాడంబరతకు ఫిదా అయిపోయాడట.


Related Posts Plugin for WordPress, Blogger...